తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో కొత్తగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్.. అంగన్‌వాడీల నియామకాలు వేగవంతం చేస్తామని రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో ఐరిస్, బయోమెట్రిక్ విధానం అమలోకి తెస్తామని అన్నారు . పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఐరిస్ విధానాన్ని ప్రవేశపెడుతామన్నారు. జనవరి నాటికి కొత్తగా 300 మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు నెలకొల్పుతామని ఆయన పేర్కొన్నారు.
