రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్కు రానున్నారు. ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేయనున్నారు ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్లో రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు రావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా దేశ ప్రథమ పౌరుడిగా కోవింద్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి బొల్లారం వస్తున్నారు. రాష్ట్రపతి ఈ నెల 26 వరకు ఇక్కడే ఉండనున్నారు..ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ అధికారవర్గాలు ఖరారు చేసిన షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వానికి అందింది.