పాల్వంచలో స్క్రాబ్ బేస్డ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన కేంద్రానికి ధన్యవాదాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. పాల్వంచలో 2008లో మూతబడ్డ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ తో తిరిగి ప్రారంభిస్తుందని వెల్లడించారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనీ కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఈ సందర్బంగా కేంద్రానికి పలు సూచనలు చేశారు.
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రవాణా సౌకర్యం ఇబ్బంది అంటున్నారని..కానీ ప్రత్యామ్యాయ్నాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఛత్తీస్ ఘర్ – బైలడిల్లా రైల్వే లైన్ ని ఉపయోగించుకుంటే రవాణా సమస్య తొలిగిపోతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. జనవరిలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పై కేంద్రం నుండి శుభవార్త వస్తుందని ఆశిస్తున్నామన్నారు.