సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వాఖ్యలు చేసారు . ఇవాళ ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. వారసత్వ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు . చిరంజీవి లేకుంటే అసలు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చేవాడా..? అని ప్రశ్నించారు .అలాంటి వ్యక్తి వారసత్వం అనే అంశంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్టును చదవటం పవన్ చాలా అలవాటు చేసుకున్నాడని రోజా మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుపై పవన్‌కు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు.
