జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో పైకి తెగ హడావుడి చేసినా పవన్‌ని పెద్ద డమ్మీగా చూసేవారట.. ఆ దెబ్బతో పవన్ కన్నీళ్ళు పెట్టుకునే వారని.. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తనకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేసిన వారిపై పగ తీర్చుకోవడానికే పవన్ పార్టీ పెట్టారని స్వయంగా పవన్ చెప్పడంతో ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ప్రజారాజ్యం రోజుల్లో అసలు ఏం జరిగిందంటే.. పవన్‌ని అల్లు అరవింద్ చాలా లైట్‌గా తీసుకునే వారట. అల్లు అర్జున్, రాంచరణ్ స్థాయిలోనే ఒక నటుడిగా మాత్రమే పవన్‌ని భావించేవారట.. ఎదైనా ముఖ్యమైన పనికి పవన్‌ని పంపిద్దామనుకున్నప్పడు చరణ్ , అర్జున్‌లు సరిపోతారంటూ అరవింద్ చెప్పేవారని పీకే చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో ప్రజారాజ్యంలో జరుగుతున్న వ్యవహారాలూ చూసి ఏడ్చేవాడినని పవన్ చెప్పడం ఇక్కడ గమనార్హం. దీన్ని బట్టి పవన్‌ని పరిస్థితి చూస్తే నాటి చిరంజీవి పార్టీలో డమ్మీని చేసి రింగులో బొంగరంలా ఆడుకున్నారని ఆయన మాటల్లో వ్యక్తం అయ్యిందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.