టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళిన సంగతి తెల్సిందే .ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ రాజమహేంద్రవరంలోని రివర్ బే హోటల్ నుండి బయటకు వచ్చింది .దీంతో అప్పటికే గుమి గూడిన పవన్ కళ్యాణ్ అభిమానులు ,జనసేన పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ఎదురుగా వచ్చారు .
ఒక్కసారిగా కొన్ని వందల మంది రావడంతో కంట్రోల్ చేయడంలో విఫలమైన పోలీసులు కారు ముందుకు అభిమానులు తోసుకు వచ్చారు .దీంతో పవన్ కళ్యాణ్ కారు డ్రైవర్ ఒక్కసారిగా కారుకు రక్షణగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ను గుద్దేశాడు .అంతే కాదు ఏకంగా కారు ముందు టైరు సదరు కానిస్టేబుల్ కాళ్ళపైకి దూసుకుపోయింది .
దీంతో ఆయన తీవ్ర గాయాలకు గురయ్యాడు .అయితే సదరు కానిస్టేబుల్ రాజానగరం కానిస్టేబుల్ పిడిం శివరామకృష్ణ గా అధికారులు గుర్తించారు .తీవ్రంగా గాయపడిన శివరామకృష్ణను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ..