ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004 నుంచి 2009 వరకు జగన్ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, 2009 తర్వాత జగన్ ఆస్తులు ఎందుకు పెరగలేదో చెప్పాలని లోకేష్ అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడులు తర్వాత ఎందుకు రాలేదన్నారు. జగన్ ప్రతి శుక్రవారమూ కోర్టుకు వెళ్లడం తప్ప ప్రజాసేవ పట్టడం లేదన్నారు. జగన్ తన ఆస్తులను ప్రకటించి తీరాలన్నారు. జగన్ అతి కొద్ది సమయంలో అన్ని ఆస్తులను ఎలా మూటగట్టుకున్నారో చెప్పాలన్నారు.
తాము హెరిటేజ్ ద్వారానే ఆస్తులను సంపాదించామని చెబుతూ.. జగన్ మాత్రం గ్రేట్ బిజినెస్ మెన్ అని లోకేష్ ఎద్దేవా చేశారు. దీంతో లోకేష్ పై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో సైటైర్లు వేస్తున్నారు. జగన్ పాలిటిక్స్‌లోకి రాకముందే.. మంచి బిజినెస్‌మెన్‌గా పేరు తెచ్చుకున్నారని.. ఆ తర్వాత రాజకీయాల్లోకి దొడ్డి దారిన రాకుండా దర్జాగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని.. ఆ తర్వాత తన తండి అకస్మాతుగా మరణించినా.. వెనకడుగు వేయకుండా.. ప్రజలకోసం పోరాటం చేస్తునే ఉన్నారని.. అక్రమంగా జైల్లో పెట్టించినా.. జడవకుండా మొండిగా ముందుకు సాగారని.. జగన్‌ను విమర్శించే అర్హత కానీ స్థాయి కానీ నీకు లేవని లోకేష్‌కి సోషల్ మీడియాలో చుక్కలు చూపిస్తున్నారు.