టాలీవుడ్ హీరో, నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ షూటింగ్ లో గాయపడ్డారనే సమచారం. తన 15వ సినిమా షూటింగ్ వికారాబాద్ లో జరుగుతూ ఉండగా కల్యాణ్ రామ్ గాయపడినట్లు మహేష్ కోనేరు ట్విట్టరు ద్వారా తెలిపారు. జయేంద్ర దర్శకుడు. తమన్నా కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ కోనేరు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం కల్యాణ్‌రామ్ గాయపడినప్పటికీ షూటింగ్‌కు విరామం చెప్పకుండా సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. అంతేకాదు పెయిన్ కిల్లర్స్ వేసుకుని శుక్రవారం షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. వృత్తిపట్ల ఆయనకి ఉన్న అంకితభావానికి హాట్సాఫ్ చెప్పారంట తోటి నటులు
