రాష్ట్ర హోంశాఖా మంత్రి నాయిని నరసింహ రెడ్డి ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు వెళ్లిన తమ ప్రతినిధుల జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు – v శ్రీనివాస్ రెడ్డి , టీఆర్ఎస్ నగరప్రధాన కార్యదర్శి – మహమ్మద్. అజమ్ అలీ టీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు – సంతోష్ గుప్తాని ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం, ఆస్ట్రేలియా లో నివసిస్తున్న వివిధ ఎన్నారై సభ్యులు సంస్థ ప్రతినిధులు కలిశారు .నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కి ఆస్ట్రేలియా లో నివసిస్తున్న వివిధ ఎన్నారై సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సాధనలో నాటి తెరాస పార్టీ ఎంపీల, మంత్రులు ఎమ్మెల్యే, కృషిని వారు అభినందించారు.
తెలంగాణలో అసలైన అభివృద్ధి తెరాస పార్టీ ద్వారానే జరుగుతుందనీ, 2019 లో అన్ని వర్గాలు కారు గుర్తుకే ఓటు వేస్తారని తెలంగాణ హోంశాఖా మంత్రి నాయిని నరసింహ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు..తెలంగాణ అభివృద్ధికి కొరకై ఎన్నారైలు కీలక పాత్ర వహించాలని నాయిని నరసింహ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం ఆస్ట్రేలియా సభ్యులు – నల్లా ప్రవీణ్ రెడ్డి, కపిల్ కాట్పెల్లీ ప్రశాంత్ కడపర్తి, అశోక్ మారం సందీప్ మునగాల , ప్రదీప్ సేరి, ప్రదీప్ తెడ్ల ,రామ్ గుమ్మడివాలి, గోవెర్దన్ సుమేషు రెడ్డి , వాసు తాట్కూర్, ప్రమోద్ ఎలెటే, , డేవిడ్ రాజు, శశి మానేం, వినోద్ ఏలేటితదితరులు నాయనినరసింహ తో మాట్లాడుతూ.. .కె.సి.ఆర్ గారు ఎన్నారై భవనాసం కోసం ఎయిర్పోర్ట్ కి దెగర స్థలం కేటాయిస్తే చాల బాగుంటుందని చాల మందికి ఉపయోగకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నారై భవనం నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయిస్తే వివిధ దేశంలో నివసిస్తున్న ఎన్నారైలు అందరు కలిసి ఎన్నారై భవనం నిర్మించుకుంటామని అన్నారు. ఆంధ్ర రాష్టంలో తెలుగు ఎన్నారైల కోసం భావనని ఆంధ్ర ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు వారు వివరించారు. తెలంగాణ లో కూడా ఎన్నారై భవనం వస్తే పలు లాభాలు వుంటాయని భారత దేశం లోనే ఒక మైలురాయి గ నిలిచిపోతుందని వారు విజ్ఞప్తి చేసారు వెల్లడించారు.
హోంశాఖా మంత్రి నాయిని నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై భవనం హైదరాబాద్లో నిర్మాణం కోసం స్థలం కీటాయింపు కొరకు తాను సీఎం కేసీఆర్తో చర్చించి కృషి చేస్తానని హామీనిచ్చారు. తెలంగాణలో ఎన్నారైలు సుఖంగా తమ తమ వ్యాపారాలు చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించడం శుభపరిణామమన్నారు.