మంత్రి కేటీఆర్ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు. ఊపిరితిత్తులు, కాలేయం వైఫల్యం కారణంగా ప్రాణాలకు ముప్పు వాటిల్లిన స్థితిలో ఉన్న చిన్నారికి పునర్జన్మ ప్రసాదించేలా చర్యలు తీసుకున్నారు. ‘కేటీఆర్ అన్నా..మా చెల్లి ఇటీవలే ప్రసవించింది. 3 రోజులుగా గాంధీ ఆస్పత్రిలో ఊపిరితిత్తులు, కాలేయం వైఫల్యం కారణంగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో ప్రమాదకరమైన స్థితిలో ఉంది. దయచేసి మీరే ఎలా అయినా..మా చెల్లిని బ్రతికించాలి ప్లీజ్’ అని ఓ నెటిజన్ మంత్రికి ట్వీట్ చేశారు.
@KTRTRS @KTRoffice Anna ma chelli delivary ayindi.3 rojuluga Gandhi Hospital lo multi organ failure kidney n liver valla life danger status lo undi.Dayachesi mere elaina ma chelli ni bratikinchali.Already baga late ayindi.Pls No money with them to shift pvt hospital.Pls help? pic.twitter.com/gyLtXPTolh
— Anwesh Rao (@anwesh_rao) December 7, 2017
దీనికి వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్…‘తప్పకుండా తగు సహాయం చేస్తాం. మీరు వైద్యుల వివరాలు అందిస్తే…డాక్టర్లతో మాట్లాడి అక్కడే చికిత్స అందిస్తాం. అవసరం అనుకుంటే..మరో ఆస్పత్రికి మార్పిస్తాం.’ అని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఆఫీసు ఉద్యోగలను సంప్రదించి చిన్నారికి తక్షణమే తగు సహాయం అందేలా చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి బృందం తగు చర్యలు తీసుకుంది.
We will take care. If you can give details, will check with doctors at Gandhi hospital or else move to another hospital. @KTRoffice please reach out https://t.co/EQJqMjom5d
— KTR (@KTRTRS) December 7, 2017