తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ పలువర్గాల అభ్యున్నతికై తీవ్రంగా కృషి చేస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకోసం ఉద్యోగాల భర్తీకి పలు చర్యలను తీసుకుంటుంది .ఇప్పటికే నలబై వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది .అంతే కాకుండా దాదాపు ముప్పై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది .ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగానికి చెందిన పలు శాఖల్లో పోస్టుల భర్తీకి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది .అందులో భాగంగా త్వరలోనే 24 జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్స్ (JPO) పోస్టుల నియామకానికి
ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్లానింగ్‌లో వెంటనే జేపీవో పోస్టుల భర్తీ చేయాలంటూ HMDA కమిషనర్ చిరంజీవులు సంబంధిత శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రతిపాదనను సమర్పించారు. దీనిపై మంత్రి అమోదం తెలిపారు.TSPSC ద్వారా ఈ పోస్టులు భర్తీ కానున్నాయి.
Tags IT Minister KTR tspsc