వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో జోరుగా సాగుతోంది. నాలుగు వందల కిలోమీటర్లు దాటిన జగన్ పాదయాత్ర ప్రస్తుతం టీడీపీ ఎంపీ జేసీ బ్రదర్స్ ఇలాకాలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతలో తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ మెయిన్ అడ్డా… ఆ నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్‌కి మంచి పట్టుంది. దీంతో గురువారం జగన్ తాడిపత్రి, శింగనమల నియోజకవర్గంలో పర్యటించగా.. తాడిపత్రిలో జగన్‌ను చూసేందుకు భారీగా తరలి రావడంతో వైసీపీ శ్రేణుల్లో జోరు పెరిగింది.
జగన్ అనంత తాడిపత్రిలో ఎంట్రీ ఇవ్వగానే అంత ఆశక్తి ఎందుకు వచ్చిందంటే.. జేసీ దివాకర్ ఎప్పుడు సమయం దొరికినా జన్ను విమర్శిస్తూ తన నోటి దూలను ప్రదర్శిస్తూ.. జగన్ పై చిందులు తొక్కుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో సవాలే అని రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ జగన్ ముందుకు దూసుకు వెళుతున్నారు. జగన్ కోసం శింగనమల నియోజకవర్గంలోనూ ప్రజల నుంచి మంచి స్పందన లభించగా… తాడిపత్రిలో అయితే జనం ప్రభంజనంలా తరలి రావడంతో జగన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు నిరాశ చెంది ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చిలు మొదలయ్యాయి.