వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అణువనువునా జనంతో మమేకమవుతూ.. తన ప్రజా సంకల్ప యాత్రను చురుగ్గా కొనసాగిస్తున్నారు. ఓ పక్క చంద్రబాబు సర్కార్ అవినీతిని ప్రశ్నిస్తూ.. మరో పక్క ప్రజలు తెలుపుతున్న సమస్యలను వింటూ.. మీ ముఖాలపై చిరునవ్వు వచ్చేంత వరకు తనవంతు ప్రయత్నిస్తానని హామీ ఇస్తూ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు.
అయితే, నవంబర్ 6న ఉదయం 9 గంటలా 47 నిమిషాలకు ఇడుపలపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించిన జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. ఏడెనిమిది నెలలపాటు కొనసాగుతున్న ఈ పాదయాత్ర మొదలు పెట్టక ముందే తిరుమలలో శ్రీవారి ఆశీస్సులు, అలాగే, కడప దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు జగన్. తన పాదయాత్రలో ప్రజలు మెచ్చిన అంశాలనే మేనిఫెస్టోలో ప్రకిస్తానని జగన్ చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం నాటికి 369.9 కిలోమీటర్లు నడిచిన జగన్ అనంతపురం జిల్లా గుమ్మేపల్లిలో 29వ రోజు గురువారం నాటికి ప్రజా సంకల్ప యాత్ర 400 కిలో మీటర్ల మైలురాయిని చేరుకుంది. ప్రజా సంకల్ప యాత్ర 400 కిలో మీటర్లు పూర్తి అయిన సందర్భంగా జగన్ గుమ్మేపల్లిలో మొక్కలు నాటారు. అంతేకాక, పాదయాత్ర 400 కి.మీ. మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో వైఎస్ జగన్‌కు నడిచే మార్గంలో పూలతో ముగ్గులు వేసిన మహిళలు హారతులతో స్వాగతం పలికారు.