జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం దేవీశ్రీ ప్రసాద్. ఈ సినిమా శవాన్ని రేప్ చేయడమనే పాయింటుతో ముందుకు వచ్చింది. చనిపోయిన యువతి పాత్రలో పూజా రామచంద్రన్ నటించింది. ఈ చిత్రానికి సినీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇకపోతే చిత్రం గురించి ధనరాజ్ పలు విషయాలు చెప్పుకొచ్చాడు.
తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టరుకి యాంకర్ అనసూయను సంప్రదించామన్నారు. ఆమె తనకు కథ చెప్పమనగానే… ఈ చిత్రంలో ఓ హీరోయిన్ వుంటుందనీ, ఓ ప్రమాదంలో ఆమె చనిపోతే, ఆమె శవాన్ని మార్చురీలో పెడతారు. ఈ శవంపై అత్యాచారం చేస్తారు… అని చెప్పగానే, అనసూయ కాస్త షాక్ తిన్నదట. ఈ చిత్రంలోని పాత్రలో నటిస్తే తన ఆడియెన్సుకు దూరమవుతానని ఫీలై రిజెక్ట్ చేసిందట. ఐతే తను నటించనని మామూలుగానే చెప్పేసిందనీ వెల్లడించాడు ధనరాజ్.
Tags anchor anasuya devisriprasad dhanaraj Movie