పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించి డీసీఐ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ విధంగా పవన్ మాట్లాడుతూ..‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అవినీతి జరిగింది.. వైఎస్ మరణించిన వెంటనే జగన్ సీఎం కావాలని చూశాడు.. అనుభవం లేని ఆయన ఏం చేస్తాడనే గత ఎన్నికల సమయంలో వైసీపీకి మద్ధతు ప్రకటించలేదు..’ అని జగన్ పై విరుచుకుపడ్డాడు. అంతేగాక తన టార్గెట్ జగన్ అనే విదంగా రెచ్చిపొయి మాట్లడినాడు. దీంతో వైసీపీ అభిమానులు తీవ్రమైన కామెంట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా పవన్ కల్యాణ్ టీడీపీ ఏజెంట్ గానే వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రజా సమస్యల కోసం అనంతపురంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ పవన్ కల్యాణ్ పై హాట్ కామెంట్స్ చేసినట్టుగా సమచారం. ‘వైఎస్ హయాంలో అవినీతి జరిగింది అని పవన్ కల్యాణ్ అన్నారు.. అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఏమైపోయారు…మరి ఎందుకు అడగలేదు అని గట్టిగా స్పపందినట్లు సమచారం.
ఇంకా నా అనుభవం గురించి పవన్ మాట్లాడారా.. నేను 2 సార్లు ఎమ్మెల్యే..ఒక్క సారి ఏంపీ 5 లక్షల ఓట్ల మేజారీటి నా అల్ టైమ్ రికార్డ్..ఇదే మాట అసెంబ్లీలో కూడ చెప్పాను. అయితే ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టే సమయానికి చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు ఉన్న అనుభవం ఏమిటి? పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి లేదు.. రెండు మూడు రోజుల పాటు హడావుడి చేయడం, ఆ తర్వాత మాయమైపోవడం అందరం గమనిస్తూనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే పవన్ కల్యాణ్ మీడియా ముందుకు వస్తుంటాడని వైఎస్ జగన్ అన్నట్లు సమచారం. తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తినప్పుడే పవన్ మీడియా ముందుకు వస్తారు. హడావుడి చేస్తారు. ఏపీ ప్రజలకు తెలుసు ఏప్పుడో అమవాస్య రోజు వచ్చి నేను ప్రజల మనిషిని అంటే నమ్ముతారా అంటున్నారు.