ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత నెల నవంబర్ 6న చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈనెల రోజుల్లో కడప,కర్నూల్ ,అనంతపురం మూడు జిల్లాల్లో దాదాపు 400 కిలోమీటర్లు నడిచారు వైఎస్ జగన్ .అన్ని వర్గాల ప్రజలు.. తమ సమస్యలను జగన్‌తో పంచుకుంటున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆయనను కోరుతున్నారు. ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్.. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ.
నాన్న చనిపోయి తొమ్మిదేళ్లు అయింది. నాన్న చనిపోయినప్పటి నుంచి పోరాటమే కదా! కోటి 30 లక్షల మంది ప్రజలు మనల్ని నమ్ముకొని ఓటు వేశారు. మన మీద నమ్మకంతో తోడుగా ఉన్నారు. గెలుపుకి, ఓటమికి మధ్య తేడా ఒక్క శాతం మాత్రమే. 5 లక్షల ఓట్లు తేడా. 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు గెలిచారు. మిగిలిన చోట ఓడిపోయిన వాళ్లు కూడా మనతో ఉన్నారు. ఇన్ని కోట్ల మంది మన మీద నమ్మకం పెట్టుకొని ఉన్నప్పుడు మనం చేసే ఏ చర్య అయినా వాళ్లల్లో ఏమాత్రం తేడా రాకూడదు. మనం.. వాళ్ల కోసం ఉండాలి. అది కాకుండా దేవుడు..ప్రజలు అవకాశమిస్తే చరిత్ర సృష్టించాలన్న తపన నాలో ఉంది. 30 ఏళ్లపాటు ఎంత గొప్ప పరిపాలన ఇవ్వాలంటే నా జీవితమున్నంత కాలం నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నాయన ఫొటో పక్కన నా ఫొటో ఉండాలనుకుంటున్నా. ఒక్క అవకాశం.. 5కోట్ల మంది జనాభాలో దేవుడు ఒక్కరికి ఇస్తాడని వైఎస్ జగన్ అన్నారు
