తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అకాలమరణంతో ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ ఉప ఎన్నికల్లో అధికార ,ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఇప్పటికే నామినేషన్లు వేసి ..ఉప ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు .ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ హీరో విశాల్ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు .అయితే మొదట రిటర్నింగ్ అధికారి హీరో విశాల్ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు .
ఆ తర్వాత కొంచెం హైడ్రామా జరిగిన పిమ్మట మరల విశాల్ నామినేషన్ ను ఆమోదిస్తున్నట్లు తెలిపారు .మరల హైడ్రామా తర్వాత అర్ధరాత్రి విశాల్ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ఈసీ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు .విశాల్ కు మద్దతు తెలిపిన ఇద్దరు దీపన్,సుమతీ సంతకాలు పోర్జరీ చేశారు అని ఆరోపిస్తూ ఈసీ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు తెల్పింది .అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది .
అదే హీరో విశాల్ నామినేషన్ ను తిరస్కరించే ముందు తనకు మద్దతు తెలిపిన సుమతీ ,దీపన్ లిద్దర్ని తమ ముందు ప్రవేశపెట్టాలని మీడియా ద్వారా విశాల్ కు తెలిపినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు .అయితే దీనికి స్పందించిన విశాల్ తనకు మద్దతు తెలిపిన ఇద్దరు కన్పించడం లేదని తెలిపాను తన సోషల్ మీడియా ట్విట్టర్ ఎకౌంటు లో పోస్టు చేశారు .అంతే కాకుండా ఓడిపోయింది నేను కాదు ప్రజాస్వామ్యం .ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది .అదే నా నామినేషన్ ను తీసుకోవాలని రిటర్నింగ్ అధికారిని నేను బెదిరిస్తునట్లు ఆయన ప్రచారం చేస్తున్నారు .ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా అని ఆయన ట్విట్టర్ లో ఆవేదనను వ్యక్తం చేశారు .