సాయిపల్లవి. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న హీరోయిన్. అంతలా తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. అంతకు ముందు మళయాళంలో తెరకెక్కిన ప్రేమమ్‌తో సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి. దిల్‌రాజు నిర్మించిన ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఫిదా, హేయ్ పిల్లగాడా చిత్రాల్లో సాంప్రదాయంగా.. మన పక్కింటి అమ్మాయిలాగానే ఉందే..! అనేలా తాను నటించే పాత్రలను ఎంచుకుంటూ వచ్చిన ఈ భామ. సెంట్‌గా నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఎంసీఏ చిత్రంలో తనలోని రొమాన్స్‌ను వెలికి తీసింది భామ.
అయితే, దిల్‌రాజు నిర్మాతగా, డైరెక్టర్ సతీష్ వేగేశ్న కాంబోలో నితిన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం హీరోగా నితిన్ ఓకే చెప్పడంతో హీరోయిన్ వేటలో భాగంగా సాయిపల్లవిని సంప్రదించారు దిల్‌రాజు. సినిమా స్ర్కిప్ట్ విన్న సాయిపల్లవి మాత్రం నో చెప్పేసిందట. ఇందుకు కారణం.. నటనకు ప్రాధాన్యం లేని పాత్రలో నేను చేయలేనంటూ.. దిల్‌రాజుకు స్వారీ చెప్పిందంట ఈ బ్యూటీ. ఈ విషయం కాస్తా సినీ జనాలచెవిలో పడటంతో.. పాత్రల విషయంలో సాయి పల్లవి బాగానే జాగ్రత్తలు తీసుకుంటుందే అంటూ చర్చించుకుంటున్నారు. అయితే, దిల్‌రాజు నిర్మాతగా నాని, సాయిపల్లవి కాంబోలో తెరకెక్కిన ఎంసీఏ చిత్రం నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.