Home / SLIDER / నాడు కాకతీయ రాజులు..నేడు టీఆర్‌ఎస్ సర్కార్

నాడు కాకతీయ రాజులు..నేడు టీఆర్‌ఎస్ సర్కార్

నాడు  కాకతీయులు చెరువులు తవ్వించారు అని ఇప్పటి వరకు చదువుకున్నాం. ఇక మీదట తెలంగాణ రాష్ట్ర సారధి, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కూడా చెరువులు తవ్వించారని ఇక మీదట చదువుకోవాల్సి ఉంటుంది. అప్పుడెప్పుడో కాకతీయుల కాలం తరువాత ఇప్పుడు తిరిగి కొత్త చెరువుల నిర్మాణానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. సమైక్య పాలకుల కుట్రలతో నిరాదరణకు గురైన కాకతీయుల కాలం నాటి చెరువులను మిషన్‌కాకతీయ ద్వారా పునరుద్ధరణ చేపట్టిన సర్కారు ఇప్పు డు కొత్త చెరువుల నిర్మాణానికి నడుంకట్టింది. 4వ విడుత మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గానికి 8చెరువులను మంజూరు చేశారు. వీటి నిర్మాణానికి స్టేజ్ -1 కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.13కోట్లను విడుదల చేసిం ది. ఈ నిధులను భూసేకరణకు వినియోగించనున్నారు. ఈ క్రమంలోనే తక్షణమే భూసేకరణ చేపట్టాలని ఈ సందర్భంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కలెక్టర్‌తో పాటు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు

సంగారెడ్డి జిల్లా జిల్లా వ్యాప్తంగా మిషన్‌కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. 3విడుతలుగా కొనసాగుతున్న పనులు సంతృప్తినిస్తున్నాయి. మిషన్‌కాకతీయ ద్వారా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు పూడికమట్టితో పంటల దిగుబడి కూడా పెరిగిందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మిషన్ కాకతీయ-4లో భాగంగా కొత్త చెరువుల నిర్మాణాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాకు 8 చెరువులను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఈ చెరువుల నిర్మాణానికి స్టేజీ-1 కింద రూ. 13కోట్లకు పరిపాలన అనుమతులు లభించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో కూడా 26కొత్త చెరువులు తవ్వాలని నిర్ణయించామని, ఆ జిల్లాకు రూ. 92కోట్లు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. విడుదల చేసిన ఈ నిధులను భూసేకరణకు ఉపయోగించనున్నట్లు మంత్రి వివరించారు. భూ సేకరణ పనులు పూర్తి కాగానే చెరువుల నిర్మాణానికి సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలు పంపించాలని చిన్న నీటిపారుదల ఛీప్ ఇంజినీరును ఆదేశించినట్లు హరీశ్‌రావు చెప్పారు.

కేవలం రెండు చెరువులు మాత్రమే ఉన్న మండలంగా జిల్లాలోని పాత మనూరు మండలం గుర్తింపు పొందినది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మండలానికి తీవ్ర అన్యాయం జరిగిందనడానికి ఇదో నిదర్శనం కూడా. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేయగా 45గ్రామాలు, 33గ్రామ పంచాయతీలతో కూడిన మనూరు మండలం నుంచి 19పంచాయతీలు, 24గ్రామాలతో కూడిన నాగల్‌గిద్ద కొత్త మండలం ఏర్పడిన విషయం తెలిసిందే. పాత మనూరు మండలంలోని 45 గ్రామాల్లో కేవలం కమలాపూర్, గట్టులింగంపల్లిలలో రెండు చెరువులు మాత్రమే ఉండేవి. ఆ రెండు చెరువులు కూడా ప్రస్తుతం మనూరు మండలంలోనే ఉన్నాయి. అంటే కొత్తగా ఏర్పడిన నాగల్‌గిద్ద మండలంలో ప్రస్తుతం ఒక్క చెరువు కూడా లేదు. ఈ క్రమంలోనే కొత్త చెరువుల నిర్మాణంలో నాగల్‌గిద్ద మండలానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కొత్త మండలంలోని ఇరక్‌పల్లి ఈస్ట్, ఇరక్‌పల్లి, మొర్గీ, కేశ్వార్, ఉట్‌పల్లి, ఏస్గీ గ్రామాలకు 6చెరువులను మంజూరు చేశారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరువ తీసుకుని కొత్త చెరువులు మంజూరు చేయడంపై ఆయా గ్రామాల రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat