జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అజ్ఞానపు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తానని అనటం సరికాదని.. ఇది తనకు నచ్చదు అని వ్యాఖ్యానించారు. తాజాగా జనసేనాని వారసత్వ రాజకీయాల పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను తానే ఖండించుకున్నారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాదన్న పవన్ విశాఖలో మాత్రం వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమనే సంఖేతాలు పంపించారు. వారసత్వ రాజకీయాలు వేల కోట్ల అవినీతి ఆరోపణల కారణంగానే తాను గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ను సపోర్ట్ చేయలేదని చెప్పారు.
దీంతో జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాజం పేట్ కాంగ్రెస్ మాజీ ఎంపీ సాయి ప్రతాప్.. గతంలో వైఎస్ కుటుంబానికి ఆప్తుడు. గతంలో ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ ముఖ్యమంత్రి అవడం కోసం ఎమ్మెల్యేల సంతకాలు సేకరించాడనేది పచ్చి అబద్దమని.. అప్పుడు జగన్ తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నారని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేని కాంగ్రెస్.. కుక్కలు చింపిన విస్తరిలా అవుతోందిని.., అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో.. జగన్ సీఎం అయితే వైఎస్ మీద అభిమానంతో మిగిలిన ఎమ్మెల్యేలు సహకరిస్తారని.. కేవీపీ ,బొత్స సంతకాలు సేకరించి సోనియాకు పంపారని, ఆ విషయం జగన్‌కు తెలియదని.. అందులో జగన్ ప్రమేయం అస్సలు లేదని.. సాయి ప్రతాప్ చెప్పారు. ఇలాంటివి ఏమి తెలుసుకోకుండా పవన్ అజ్ఙానపు వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో పవన్‌కి తమ తిక్కను చూపిస్తున్నారు నెటిజన్లు.