తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఆలోచనల నుంచి పుట్టుకువచ్చిన అప్నా షహర్.ఈ వేదిక ద్వారా మంత్రి కేటీఆర్ ప్రజలను నేరుగా కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు సాధ్యాసాధ్యాలను బట్టి అక్కడికక్కడే పరిష్కారం చూపనున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు నగరాభివృద్ధిపై సామన్యపౌరులతో పాటు ప్రజాప్రతినిధులు, సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతీరును అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం.
మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మన నగరం(అప్నా షహర్) పేరుతో సరికొత్తగా రూపొందించిన ఈ పథకంపై మహానగర ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఎక్కడ ఈ కార్యక్రమం ప్రారంభం కానుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. పా్టీలోని విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం..టౌన్ హాల్ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండే ప్రారంభం కానుంది. టౌన్ హాల్ మీటింగ్‌ల పేరిట గ్రేటర్ పరిధిలోని మొత్తం 30 సర్కిళ్లలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం మొదటిసారిగా కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో ప్రారంభం కానుంది. ఇందుకు కొంపల్లిలోని పీఎస్‌ఆర్ గార్డెన్ వేదిక కానుంది.
ఈ నెల 16న ఉద యం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా గాజులరామారం, కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లకు చెందిన సమస్యలను అడిగి తెలుకోనున్నారు. అయితే ఈ సమావేశాలకు మంత్రి కేటీఆర్ స్వయంగా హాజరు కానుండటంతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పా ల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కుత్బుల్లాపూర్ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడి ప్రజలే కాకుండా…నగర ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.