జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారెజ్ వద్దకు చేరుకున్నారు.మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు . అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పుర్తికావాలని అధికారులను ఆదేశించారు . అనంతరం సీఎం కేసీఆర్ అక్కడినుంచి కన్నెపల్లి పంప్ హౌస్ కు బయలుదేరారు సీఎం కేసీఆర్ వెంట అధికారులు, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు వినోద్, బాల్క సుమన్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.