తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని రీతిలో ప్రాజెక్టుల యాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకే ఆయన టూర్ వేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు సీఎం కేసీఆర్ అర్జెంటుగా ఫోన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఏం జరిగిందంటే…
ప్రాజెక్టుల పర్యటనకు బయల్దేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం సాయంత్రం కరీంనగర్‌కు చేరుకుని, ఆ వెంటనే తనను కలవడానికి వచ్చిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ద్వారా కోటి ఎకరాలకు నీరందించే లక్ష్యాన్ని వివరించిన సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు, ప్యాకేజీ పనులు, బ్యారేజీలు పూర్తయితే కరీం నగర్ పూర్వ జిల్లా చుట్టూ గోదావరి జలాలు చేరుతాయని వివరించారు. ప్రతి ఎకరాకు నీరందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. కాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చినట్లేనని పేర్కొన్నారు. ఎగువ ప్రాంతానికి నీరందించేందుకు అవసరమైతే మరిన్ని ఎత్తిపోతల పథకాలు తీసుకువస్తామన్నారు.
ఈ సందర్భంగానే కరీంనగర్ మానేరు డ్యాం వద్ద 500 కోట్ల రూపాయలతో చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ కరీంనగర్‌కు మణిహారం కానుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ అంశంపై మాట్లాడుతూ పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అదే చర్చ నుంచే రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసి చెప్పారు. డీపీఆర్ సిద్ధం చేసి…టెండర్లు త్వరగా పిలి చి పనులు ప్రారంభించాలని సూచించారు. దీంతో ముఖ్యమంత్రి కలిసి చర్చల్లో పాల్గొన్న పలువురు…సీఎం చిత్తశుద్ధికి ఆశ్చర్యపోయారు.