ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నడా ..?.జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉసిగొల్పి మరి పవన్ ను రంగంలోకి దించుతున్నడా ..?.అంటే అవును అనే అంటున్నారు వైసీపీ శ్రేణులు .వైఎస్ జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ ఫ్యాన్ ..వైసీపీ పార్టీ కార్యకర్త ,సోషల్ మీడియాలో టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై పోరాడుతూ పోస్టులు పెడుతూ ఇటు నెటిజన్లను అటు ప్రజలను చైతన్యవంతులు చేస్తున్న శరత్ కుమార్ దాసరి (Sarat Kumar Dasari)అనే యువకుడు పక్క ఆధారాలతో పోస్టు చేశాడు .యదతదంగా మీకోసం ..
“పవన్ కల్యాణ్, చంద్రబాబు గారు రహస్య మిత్రులు అనే అనుమానం ప్రజలకి రావటానికి ముఖ్య కారణాలు. ?
1) జగన్ వెనకాలే పవన్ పర్యటన.
2015 మార్చ్ 3 — తాడేపల్లి , మంగళగిరి , తుల్లూరు మండలాలలొ జగన్ పర్యటన చెయగానే వెంటనే అక్కడికి పవన్ కళ్యాణ్ (రెండు రొజులకి) 2015 మార్చ్ 5 న ఉండవల్లి, ఎర్రబాలెం, బేతపుడి, తుల్లూరు లొ పర్యటించారు. (రాజధాని అవసరమే రైతులని ఒప్పించి తీసుకొండి అని సలహ ఇచ్చి వచ్చారు )
2) ధర్నాకు పిలుపు ఇచ్చిన జగన్..దానికన్న ముందు పర్యటన పెట్టుకున్న పవన్..
ప్రభుత్వం చెస్తున్న అడ్డగొలు భూసేకరణ పై ప్రజలు, రైతులు, రైతు కూలీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు , ప్రజా సంఘాలు, రైతు కూలి సంఘాలు ఆగస్టు 25-2015 న బంద్ కి పిలుపునిచ్చాయి , ప్రతిపక్ష నాయకుడు జగన్ అంతకుముందే 26 న ధర్న కి పిలుపునిచ్చి ఆయనే స్వయంగా వస్తా అన్నారు , ఇలా అన్నారొ లేదొ పవన్ గారు అక్కడికి వచ్చి బలవంతంగా భూములు లాకొవద్దు , వాళ్ళకి నచ్చితే తీసుకొండి అని ప్రభుత్వానికి చెప్పారు.అక్కడ ప్రభుత్వం మీద వచ్చిన వ్యేతిరకతని జగన్ ఎక్కడ లాభం పొందుతాడొ అని పవన్ ని అడ్డం పెట్టి పవన్ చెప్పాడు భూసేకరణ తాత్కాలికంగా వాయిదా వేశారు అనే భావన కలిగే లా చెసి. (తరువాత గుట్టుచప్పుడు కాకుండా బెదిరించి భయపెట్టి భూసేకరణ చేసేరు బయటకి రాజధాని రైతులు మొత్తం ఇష్టంగ 33వేల ఎకరాలు ఇచ్చారు అని చెప్పారు ).
3) ప్రత్యేక హొదా జగన్ బంద్ పిలుపు ..పవన్ దేశ సమగ్రత ట్విట్ విన్నపం.
2015 ఆగస్టు 10 న డిల్లీ లొ జగన్ ప్రత్యెక హొదా కొసం భారి ధర్న చేశారు , 15 రొజులకి అంటే అగస్టు 25 న చంద్రబాబు డిల్లీ వెళ్ళి , ప్రత్యెక హొదా కన్న ప్యాకేజి ఏ బాగుంటది అని చెప్పారు , దీనితొ జగన్ ప్రత్యేక హొదా ఇచ్చే లా చంద్రబాబు మొడి మీద వత్తిడి ఎందుకు తేలేకపొతున్నారు , వాళ్ళు కన్న మీర ముందు ప్యాకేజి కి ఎందుకు అనుకులత చూపిస్తున్నారు అని కెంద్రం లొ మొడి , రాష్ట్రం లొ చంద్రబాబు ప్రభుత్వాలు ఆంద్రప్రదేశ్ ప్రజల్ని మొసం చెస్తున్నారు అని ఆగస్టు 29 న రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చారు , కాని పవన్ ఆగస్టు 28 న (బంద్ కి ఒక్కరొజు ముందు పవన్ ఇలా ట్విట్ చేశారు – నేను విభన వలన జరిగిన నష్టం ని మొడి కి వివరించాను సానుకూలంగా స్పందించారు, వారు ఇచ్చిన హామిని నెరవేరుస్తారు అని భావిస్తున్న , దేశ సమగ్రత దృష్టి లొ పెట్టుకుని భావొద్వేగాలకి పొకుండా ఇంక కొంతకాలం వేచి చూద్దం అని ట్విట్ చేశారు పవన్)
4) జగన్ తొ పాటు విపక్షాలు బంద్ కి పిలుపు , ప్రజలెందుకు పొరాడాలి అని చెప్పిన పవన్..
2016 సెప్టెంబర్ 8న అర్ధరాత్రి అరుణ్ జైట్లి గారు ప్రెస్ మీట్ పెట్టి , హొదా లేదు , ప్రత్యేక సహయాం చెస్తాం అని చెపారు , తరువాత రొజు 9వ తారీకున విపక్షాలతొ పాటు జగన్ గారు కూడా 10వ తారీకున రాష్ట్ర బంద్ కి పిలుపుని ఇచ్చారు , పవన్ కళ్యాన్ గారు అదే సెప్టెంబర్ 10న కాకినాడ లొ సభ పెట్టి , ప్రజలు ఎందుకు పొరాడాలి , బి.జే.పి పాచిపొయిన లడ్డులు ఇచ్చింది , పార్లమెంటు మెంబర్లు మాత్రమే పొరాడాలి అని చెప్పుకొచ్చారు ( అలా బందులొ ప్రజలు భాగస్వామయం వద్దు అన్నారు.
5) జగన్ జై ఆంద్రప్రదేశ్ .. పవన్ సీమాంద్ర హక్కులు.
2016 నవంబర్ 6 న విశాఖ లొ జై ఆంద్రప్రదేశ్ సభ పెట్టి ప్రత్యేక హొదా ఇవ్వల్సిందే అది ఎన్నికలలొ చంద్రబాబు, మొడి కలిసి ఇచ్చిన హామి, ప్రత్యేక హొదా తొనే మనకి మనుగడ అని సభ లొ ప్రశంగించారు, 2016 నవంబర్ 10 న ( నాలుగు రొజులకి) పవన్ అనంతపూర్ లొ సీమాంద్ర హక్కుల సభ అని పెట్టి బి.జే.పి ని మీరు అర్ధరాత్రి ఎందుకు ప్యాకేజి ఇచ్చారు , నాకు మొక్కలంటే ఇస్టం , నేను కూలి పని చేస్తా , అని మాట్లాడారు.
6) అగ్రి గొల్డ్ జగన్ ..వెనకాలే పవన్..
2017 మార్చ్ 23 న జగన్ దీక్ష చెస్తున్న భాదితుల దగ్గరికి వెళ్ళి మీకు అండగా ఉంట మీరు అధైర్య పడద్దు ఏవ్వరు ఆతమహత్య చెసుకొవద్దు, న్యాయం జరిగేలా చంద్రబాబు మీద వత్తిడి తెస్తా , ఒకవేల ఈ రెండు ఏళ్ళ లొ ఆయన స్పందించకపొతే తరువాత మీకు ఎలా న్యాయం చెయాలొ నాకు తెలుసు 1,182 కొట్లు కేటాయించి 14 లక్షల మంది అగ్రిగొల్డ్ భాదితులని నేను ఆదుకుంట , చనిపొయిన వారికి 3 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం , ఎవ్వరి అధైర్య పడద్దు అని భరొసా ఇచ్చి ధీక్ష విరమింప చేశారు , సరిగ్గ ఆరు రొజుల తరువాత మార్చ్ 30న పవన్ కళ్యాణ్ గారు అగ్రిగొల్డ్ భాదితులతొ ముఖాముఖీ కార్యక్రమం ఏర్పాటు చేసి అగ్రిగొల్డ్ విషయం కొర్టు లొ ఉంది, ఏజెంట్లది తప్పులేదు ముళ్ళ మీద గుడ్డ పడింది జాగ్రత్త గా తీసుకొవాలి ప్రభుత్వం దీనిని పరిష్కరించాలి అని చెప్పారు .
7) జగన్ రైతు దీక్ష విరమించిన 30 నిమషాలకే పవన్ ప్రకటన..
రాష్ట్రం లొ దళారీల వలన మిర్చి,పత్తి,కంది,పసుపు రైతులు మద్దతు దర లేక పండించిన పంట అమ్ముకొవటానికి అవస్తలు పడుతుడటం చూసి , ప్రభుత్వం నుంచి ఎంతకి చెలనం లేకపొవటం తొ జగన్ గారు గుంటూరు లొ 2017 మే 1,2 తారీకులలొ దీక్ష చెపట్టారు , ఇలా చెపట్టి 2వ తారీకు దీక్ష విరమించగానే, పవన్ గారు రైతులకి మద్దతు ధర కల్పించాలి అని ప్రకటన విడుదల చెశారు.ఇవే కాక చంద్రబాబు గారికి అనుకూల పత్రికలు మీడియా ఎంటి అనేది భహిరంగ రహస్యం , కాని అవి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు ప్రకటించటం.మాకు తెలిసి పవన్ గారు బయటికి వచ్చింది , ఉద్దానం కిడ్నీ భాదితుల కొసం , చేనేత సభ కొసం , ఇందులొ చెనెత సభ కి వాళ్ళు పిలిస్తే వెళ్ళారు,మిగతా వి ఉత్తర భారత దక్షిణ భారత ట్విట్లు..
8) జగన్ పాదయాత్ర ..పవన్ ప్రత్యక్ష రాజకీయాల ప్రకటన..
రాష్ట్రం లొ తెలుగుదేశం పాలన లొ అవినీతి , అకృత్యాలు పతాకస్థాయి కి చెరి ప్రజలని గ్రామ గ్రామాన కమిటీలు వేసుకుని పీక్కుతింటుంటే , జగన్ గారు వీరికి అండగా తొడుగా ఉండటానికి అక్టొబర్ 27 నుండి 3వేల కిలొమీటర్లు , ఆంద్ర ప్రదేశ్ లొని ప్రతి జిల్లాకి పాదయాత్ర గా వస్తా అని ప్లీనరీ లొ జులై 9 న ప్రకటించారు
పవన్ కల్యాణ్ గారు జులై 31 న ఉద్దానం అని చెప్పి చంద్రబాబు గారిని కలిసి సుమారు గంట సేపు చర్చలు జరిపి బయటకి వచ్చి నేను అక్టొబర్ నుండి పూర్తి స్థాయి రాజకీయాలలొకి వస్తా అని ప్రకటించారు , పైగా నేను కమిట్ అయిన సినిమాలు ఉన్న డైరెక్టర్లని, ప్రొడ్యుసర్లకి నచ్చ చెప్పుకుని వస్తా అని చెప్పారు , ముందు నుండి ప్లానింగ్ ఉంటే సినిమాలు ఎందుకు ఒప్పుకున్నారు అని ఒక ప్రశ్న.
9) వై.సి.పి పొలవరం టూర్ పెట్టుకున రొజే పవన్ పొలవరం టూర్..
పొలవరం లొ జరుగుతున్న అవినీతి ని ప్రజలకి తెలియచెయటానికి వై.యస్.ఆర్ కాంగ్రెస్ డిసెంబర్ 7 న పొలవరం పర్యటన చెస్తున్నం అని డిసెంబర్ 2 న ప్రకటించగానే , పవన్ కల్యాన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టి పెట్టుకున్న డిసెంబర్ 7 నే పొలవరం టూర్ చెస్తాం అని డిసెంబర్ 5న ప్రకటన విడుదల చేశారు.ఇలా జరిగిన వరుస సంఘటనలు చూస్తే జగన్ అనే శక్తి ని అడ్డుకొవటానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ని ప్రయొగిస్తున్నరు అనే అనుమానం మరింత పెరుగుతుంది.”అని శరత్ అనే నెటిజన్ పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది ..