ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఒకవైపు ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా విదేశాల్లో పర్యటిస్తున్న ఆయనకు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన అరకు పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ కొత్తపల్లి గీత సంచలన నిర్ణయాన్ని తీసుకొని బిగ్ షాకిచ్చారు .
గతంలోనే ఎంపీ గీత కులం విషయంలో టీడీపీ నేత సంద్యారాణి ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో కేసు వేసిన సంగతి తెల్సిందే .దీంతో ఆమె పార్టీ మారితే ఈ కేసును వెనక్కి తీసుకుంటామని ..కాంట్రాక్టులు ఇస్తామని బాబు ఇచ్చిన హామీతో ఆమె గెలిచిన కొద్ది రోజులకే టీడీపీలో చేరారు .అయితే,గత కొంతకాలంగా బాబు ఈ విషయం మీద నాంచడమే కాకుండా అధికార పార్టీకి చెందిన నేతలు గీత పట్ల ముట్టిముట్టని విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు .
దీంతో ఆమె మీడియాతో మాట్లాడుతూ “టీడీపీలో చేరిన దగ్గర నుండి ఒక మహిళకిచ్చే కనీస మర్యాద కూడా ఇవ్వడంలేదు .నేను ఎంపీ అనే విషయాన్నీ కూడా గుర్తించడంలేదు .అందుకే ఇటివల అరకులో జరిగిన ఒక విశిష్ట కార్యక్రమంలో ,బిల్ గ్రేట్ వచ్చిన సమయంలో తనకు కనీసం పిలుపు కూడా లేదు .నేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర మనస్థాపానికి గురయ్యాను .నేను వచ్చే ఎన్నికల్లో అరకు నుండి పోటి చేయను .అంతే కాకుండా టీడీపీలో కూడా ఉండను .వచ్చే ఏడాది ఆగస్టు నెలలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను .అయితే కష్ట కాలంలో తనకు ప్రధాని మోదీ అండగా ఉన్నారు .అందుకే ఇంకా ఏ పార్టీలో చేరాలి అనే విషయం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని ఆమె తెలిపారు ..