Home / ANDHRAPRADESH / వాటిని ఎదుర్కొవడానికి ముందుగానే సిద్ధమయ్యా.. వైఎస్ జగన్

వాటిని ఎదుర్కొవడానికి ముందుగానే సిద్ధమయ్యా.. వైఎస్ జగన్

వేల కిలోమీటర్లు నడిచేప్పుడు కళ్ళకు బొబ్బలు రావడం సహజం… వాటికి గట్టిగా బ్యాండేజ్లు కట్టేస్తే.. బొబ్బ తానంతట అదే గట్టిగా అయిపోతోంది. ఇలాంటి వాటిని ఎదుర్కొవడానికి ముందుగానే సిద్ధమయ్యా.. అని ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ …సాధారణంగా అందరూ వేసుకునే బూట్లనే నేను వాడుతున్నాను. కాకపోతే కొంచెం క్వాలిటీ ఉన్నవి కావొచ్చు. అంతేగాని నా బూట్లకు వేరే ప్రత్యేకత ఏమీ లేదని స్పష్టం చేసారు .

ఈ నెల రోజుల యాత్రలో మీరు ఎక్కువగా ఏ విషయాలు గమనించారు..?అని అడుగగా

60శాతం వ్యవసాయంపై ఆధారపడే రైతులు, కూలీలను గమనించాను. వారు పండిస్తున్న ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. రైతు దగ్గర నుంచి టోమాటోలాంటివి రూ.2 రూ.3 తిరిగి హెరిటేజ్‌వంటి వాటిల్లో మాత్రం రూ.30, రూ.40 ఉంటున్నాయి. చంద్రబాబే స్వయంగా దళారీగా మారారు. ఈ విషయం స్వయంగా ప్రజలే నాకు పాదయాత్రలో చెబుతున్నారు అని అన్నారు .

మీరు అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తారనే నమ్మకం ప్రజలకు కలిగిందా? అని అడుగగా..
జనంలో స్పష్టంగా ఆ ఫీలింగ్‌ కనిపిస్తోందని సమాధానం ఇచ్చారు.

ఈ పాదయాత్రలో మహిళలు ఎలా రియాక్ట్‌ అవుతున్నారు? అని అడుగగా…

చంద్రబాబు చేతుల్లో ప్రతి వర్గం మోసపోగా ఎక్కువగా మోసపోయింది అక్కాచెల్లెమ్మలే.. బ్యాంకుల్లో ఉన్న తమ బంగారం ఇంటికొస్తుందని చంద్రబాబు మాటలు నమ్మి వారు ఆశపడ్డారు. వైఎస్‌ పాలనలో గతంలో పావలా వడ్డీకి, సున్నా వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. వడ్డీ డబ్బులు ప్రభుత్వం కట్టేది. ఇప్పుడు మాత్రం వడ్డీ డబ్బులు చంద్రబాబు ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఈ విషయాలన్నీ మహిళలు స్వయంగా చెబుతున్నారని అన్నారు .

పాదయాత్రలో ఆచరణ సాధ్యంకాని హామీలిస్తున్నారంటున్నారు దీనిపై ఏమంటారు? అని ప్రశ్నించగా …

నేను పాదయాత్రలో చెబుతున్న హామీలు కొత్తగా ఇస్తున్నవి కాదు. ప్లీనరీలోనే చెప్పాం. అవే తిరిగి చెబుతున్నాం. అదనంగా కరెంట్‌లాంటి విషయాలు చేర్చాం. అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రజల నుంచి మంచి ప్రతిస్పందన వస్తుంది. అది చూసి ఓర్వలేకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అని అన్నారు .

ప్రశాంత్‌ కిషోర్‌ మీకు ఏం చెప్తారు? అని అడుగగా …
ప్రశాంత్‌ కిషోర్‌ నాకు సలహాలు ఇస్తారు. ఆయన ఇచ్చిన సలహాలను నేను తీసుకుంటానా? లేదా? అనేది వేరే విషయం. ప్రతి సలహాను ఆచరణలో పెట్టం. ఆయన చెప్పిన దానితో విభేదిస్తాం.

అభ్యర్థుల ఎంపికలో ప్రశాంత్‌ పాత్ర ఉంటుందా? అని అడుగగా
ప్రతి పార్టీకి వాళ్ల సర్వే టీమ్‌లు ఉంటాయి. అభ్యర్థికి నియోజకవర్గంలో ఫాలోయింగ్‌ ఉందా? అనే విషయాన్ని సర్వేల ద్వారా తెలుసుకుంటారు. ప్రజల్లో ఎవరూ బావుంటే వాళ్లకే టికెట్లు ఇస్తారు.

 

 

 

 

 

 

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat