సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది రష్మీ. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలతోపాటు హీరోయిన్‌గా నటించే అవకాశాలను కూడా చేజిక్కించుకుంది. వెండితెరపై ఎన్ని అందాలు ఆరబోసినా స్టార్ హీరోయిన్ హోదాను అందుకోలేక పోయింది రష్మీ. దీంతో వెండితెర నుంచి బుల్లితెరకు తన మకాం మార్చింది. ప్రస్తుతం యాంకర్‌గా పలు టీవీ షోలతో అదరగొడుతోంది. అయితే, ఇటీవల కాలంలో వరుస చిత్రాల్లో నటిస్తూ యాంకర్ కమ్ యాక్టర్‌గా సెటిల్ అయిపోయింది. వెండి తెర కాకపోతే.. బుల్లితెర.. బుల్లితెర కాకపోతే వెండి తెర అంటూ తన సినీ కెరియర్‌ను కొనసాగిస్తోంది రష్మీ.
అయితే, ఇటీవల ఓ ఛానెల్‌కు రష్మీ ఇంటర్వ్యూ ఇవ్వగా.. తనతో డేటింగ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. తనతో డేటింగ్ చేయాలనుకునే వారు ఖచ్చితంగా 5లక్షలతో రావాలని చెప్పింది. అయితే, 5లక్షలు సరిపోతాయా.? అన్న ప్రశ్నకు రష్మీ సమాధానం చెబుతూ.. 5లక్షలు అంటే నేను నటించిన ఏ సినిమానైనా 5వేల సార్లు చూడాలి. అంటే ఒక్కో షోకు వంద రూపాయలు చొప్పున ఖర్చు చేసినా 5వేల సార్లు అంటే 5లక్షలు సులభంగా ఖర్చైపోతాయిగా మరీ అంటూ సమాధానం ఇచ్చింది. రష్మీ సమాధానం విన్న సదరు ప్రేక్షకులు రష్మీతో డేటింగ్ ఇంత కాస్ట్లీనా అంటూ తెగ వాపోతున్నారు.