గాయత్రి గుప్తా. ఫిదా సినిమాతో తెలుగు సినీ జనాలకు బాగా దగ్గరైంది ఈ హాట్ భామ. కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల కోసం నానా కష్టాలుపడ్డ ఈ భామ.. ప్రస్తుతం సినీ ఇండస్ర్టీలో ఓ రేంజ్లో దూసుకుపోతుంది. అయితే, ఇటీవల కాలంలో హీరోయిన్లపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, దర్శకులు, నిర్మాతలు అయితే ఎప్పుడు కలుద్దామని డైరెక్టుగా అడిగేస్తున్నారంటూ చాలా మంది హీరోయిన్లు మీడియాతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో గాయత్రి గుప్తా చేరిపోయింది.
ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాయత్రి గుప్తా తను లైంగిక దాడికి గురైన విషయాలను చెప్పుకొచ్చింది. ఆ విషయాలు గాయత్రి గుప్తా మాటల్లో…
రెండు సంవత్సరాల క్రితం ఒక మూవీ ఒప్పుకున్నాను. నేను ఏ మూవీ అంగీకరించినా.. మొదటగా నా కండీషన్స్‌ను వారికి చెబుతాను. కమిట్మెంట్ లాంటివి.. పడుకోవడం లాంటివి ఉంటే నేను చేయనంటూ వచ్చిన వారికి మొహమాటం లేకుండా చెప్పేస్తాను. అలా చెప్పిన తరువాతే సినిమా స్టోరీ, అందులో నా క్యారెక్టర్ వింటాను అంటూ చెప్పింది గాయత్రి గుప్తా. అయితే, నేను చెప్పిన కండీషన్స్ విన్న ఓ చిత్ర బృందం… మా సినిమాలో అలాంటివి ఏమీ లేవు. మేము ఆర్టిస్టులను గౌరవిస్తామంటూ చిలక పలుకులు పలికి.. షూటింగ్ ప్రారంభమయ్యాక డైరెక్టర్, ప్రొడ్యూసర్ తనను గెలకడం మొదలు పెట్టారన్నారు.
నేను ముందే చెప్పాను కదా..! నేను ఇందుకు సిద్ధంగా లేను..! మీరెందుకు ఇలా చేస్తున్నారని అడిగినా.. నా మీద చేతులు వేశారు. అలా నేను వారికి ఒప్పుకోకపోవడంతో ఒకానొక సమయంలో నాపై రేప్ అటాక్ కూడా చేశారు. ఇంట్లో డ్రాప్ చేస్తామని కారెక్కించుకుని.. మార్గమధ్యలో కారు స్టార్ట్ కావడం లేదంటూ మాయమాటలు చెప్పి… ఇంటికి తీసుకెళ్లారని, ఇంటికి వెళ్లిన తరువాత వారు నా బట్టలు విప్పి నాపై రేప్ అటాక్ చేశారని.. కానీ, అక్కడ్నుంచి ఎలాగోలా తప్పించుకున్నానంటూ మీడియాకు చెప్పుకొచ్చింది గాయత్రి గుప్తా.