Home / MOVIES / ప్ర‌ముఖ హీరోతో రాజ‌శేఖ‌ర్ కూతురు రొమాన్స్‌..!!

ప్ర‌ముఖ హీరోతో రాజ‌శేఖ‌ర్ కూతురు రొమాన్స్‌..!!

తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో తండ్రి వార‌స‌త్వంతో హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చిన ఒక్క‌రే. ఆమెనే మెగా డాట‌ర్ నిహారిక‌. ఇదే జాబితాలో తాను ఉంటానంటోంది హీరో రాజ‌శేఖ‌ర్ కూతురు శివాని. నిహారిక క‌న్నా తానేమి త‌క్కువ కాదంటూ పోటీ ఇచ్చేందుకు రెడీ అంటోంది శివాని.

అయితే, నిజానికి త‌న త‌న‌య‌ని ఇంత‌కు ముందే టాలీవుడ్‌కు ప‌రిచయం చేయాల‌నుకున్నాడు రాజ‌శేఖ‌ర్‌. కానీ, ఓ వైపు ఆర్థిక స‌మ‌స్య‌లు, మ‌రో వైపు త‌న కెరియ‌ర్ స‌రిగ్గా లేక‌పోవ‌డంతో వెన‌క‌డుగు వేశాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ పుణ్య‌మా అని గ‌రుడ‌వేగ చిత్రంతో హిట్ కొట్టిన రాజ‌శేఖ‌ర్, త‌న కూతురు సినీ ఇండ‌స్ర్టీ ఎంట్రీకి ఇదే స‌మ‌య‌మ‌ని భావించాడు. ఈ నేప‌థ్యంలోనే హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను సెలెక్ట్ చేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ, శివానిల‌తో ఓ సినిమా తీసేందుకు ప్లాన్ చేశాడు రాజ‌శేఖ‌ర్.

ప్ర‌స్తుతం శివాని మెడిసిన్ చ‌దువుతోంది. మ‌రో ప‌క్క విజ‌య్ వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ.. బిజీగా గ‌డుపుతున్నాడు. అయితే, శివాని మెడిసిన్ ప‌ర్త‌య్యే స‌రికి విజ‌య్ సినిమాలు ఓ కొలిక్కి వ‌స్తాయ‌ని, ఈ మ‌ధ్య‌లోనే విజ‌య్‌తో చ‌ర్చ‌లు జ‌రిపి శివాని ఎంట్రీని ఓ కొలిక్కి తీసుకురానున్నారు రాజ‌శేఖ‌ర్‌. ఈ విష‌యం కాస్తా సినీజ‌నాల చెవిన ప‌డ‌టంతో రాశేఖ‌ర్ కూతురు శివాని త్వ‌ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రొమాన్స్ చేయ‌నుందా..! అంటూ చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat