త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ఆ పార్టీ భావి ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీ పప్పులో కాలేశారు .ప్రస్తుతం త్వరలో జరగనున్న గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న ఆయన లెక్క తప్పారు .ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీను గత కొద్దిరోజులుగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నల వర్షంతో హోరెత్తిస్తున్నారు .
ఈ నేపథ్యంలో ప్రశ్నల్లో భాగంగా ఏడో ప్రశ్నను సందిస్తూ సరిగ్గా మూడు యేండ్ల కిందట అంటే 2014లో పప్పు ధర కేవలం రూ .45లు ఉండగా ..ప్రస్తుతం ఎనబై రూపాయలు ఉంది అని పేర్కొన్నారు .అయితే పప్పు ధరల పెరుగుదల శాతం డెబ్బై ఏడుకు బదులు నూట డెబ్బై ఏడుగా పేర్కొన్నారు .అంతే కాకుండా తను ప్రకటించిన లెక్కల టేబుల్ లో ఆసాంతం తప్పులు తడకే కన్పించాయి .దీంతో సోషల్ మీడియాలో కాబోయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి లెక్కలు కూడా సరిగా రావా అని నెటిజన్లు కామెంట్లు చేశారు ..