ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా జగన్ అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .గత నెల రోజులుగా జగన్ చేస్తున్న పాదయాత్రకు పలు వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .జగన్ కు మహిళల దగ్గర నుండి విద్యార్ధి ,యువత ,ముసలి వాళ్ళు ,రైతుల వరకు అన్ని వర్గాలు బ్రహ్మరథం పడుతున్నారు .అయితే జగన్ పాదయాత్రను అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మీడియాకు చెందిన బాబు ఆస్థాన మీడియాగా ముద్ర పడిన పద్నాలుగు ఛానల్స్ ,మూడు ప్రధాన పత్రికలు ఎటువంటి ప్రచారం చేయడంలేదు .
అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలిచి ప్రజల సమస్యలను తీర్చి రాజన్న పాలనను తీసుకురావాలని ఆశిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గట్లు తమ పార్టీ ప్రచార వుహ్యా కర్తగా ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకేను నియమించుకున్న సంగతి తెల్సిందే .ఇటివల జరిగిన వైసీపీ ప్లీనరీ సభ సాక్షిగా జగన్ ప్రకటించిన నవరత్నాలు నుండి జగన్ పాదయాత్రను అన్న వస్తున్నాడు అని ప్రారంభిస్తే అది వద్దు ప్రజల వద్దకు పోతున్నారు కాబట్టి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తే బాగుంటది .ప్రజలలో సానుకూల సంకేతాలు పోతాయి అని సూచించడం వరకు పీకే తనదైన స్టైల్ లో ముద్ర వేస్తున్నారు .
అయితే గత నెల రోజులుగా తెలుగు మీడియా ఎటువంటి ప్రచారాన్ని కల్పించకపోయిన కానీ పీకే సోషల్ మీడియాను వినియోగించుకొని ప్రజలలోకి ,నెటిజన్లలోకి జగన్ చేస్తున్న పాదయాత్రను శరవేగంగా తీసుకెళ్తున్నారు .అందులో భాగంగా జగన్ సభల దగ్గర ,ప్రజలను రీసీవ్ చేసుకునే సమయంలో ఇచ్చే స్పీచ్ లను వీడియోల రూపంలో తయారుచేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ముఖ పుస్తకం ,ట్విట్టర్ లలో పోస్టింగ్స్ చేయడమే కాకుండా యూ ట్యూబ్ లో పెడుతూ తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇవ్వనంత ప్రచారాన్ని కల్పిస్తున్నాడు .జగన్ ఇచ్చిన స్పీచ్ ను ఒక్క గంటలోనే లక్షమంది చూస్తున్నారు అంటేనే పీకే పబ్లిసిటీ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది .అంతే కాకుండా సోషల్ మీడియాలో కొన్ని వేల షేర్లు ,కొన్ని లక్షల మందికి రీచ్ అవ్వడం పీకే చేస్తున్న ప్రచారానికి యెల్లో మీడియాకు పట్టపగలే చుక్కలు కన్పిస్తున్నాయి అని వైసీపీ శ్రేణులు ,జగన్ అభిమానులు ,నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు .