పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించారు. ఆయన డీసీఐ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ మొహన్ రెడ్డిని నేనే ఒక మాట అడుగుతన్న మీరు కూడ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ) ఉద్యోగులకు అండగా నిలబడండి. ఇది ఏ పార్టీ భాద్యత అని అడగలేదు …మీరు అండగా నిలమడాల్సిన అవసరం ఉంది.మీరు ఓట్లు అడగండి..తరువాత ముఖ్యమంత్రి అవ్వండి కాని ప్రజా సమస్యల కోసం పోరాడండి నీకు నేను అండగా ఉంటా..నేను మీతో పాటు నడుస్తా అని పవన్ కల్యాణ్ అన్నారు.
