ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో పర్యటించారు .డీసీఐ ఉద్యోగులకు అండగా ఉంటూ భరోసా ఇవ్వడానికి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు .
చంద్రబాబును ఉద్దేశిస్తూ తను ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి తన తనయుడు నారా లోకేష్ నాయుడు ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం మూర్ఖత్వం .మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాము .ఎటు పోతుంది .నేను గతంలో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు చేసిన కుట్రల వలన వచ్చిన అవినీతి ఆరోపణల వలన నేను సార్వత్రిక ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదు .
అందుకే అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చాను .ఈసారి నమ్మి మోసపోదలచుకోలేదు .అందుకే ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాను .అవినీతి అక్రమాలు లేని పాలన రావడానికి నా వంతు పాత్ర పోషిస్తాను అని వైజాగ్ సాక్షిగా ఆయన తెలిపారు .