ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి చిరకాల మిత్రుడు ,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను అధికారాన్ని ,పదవులను ,నోట్ల కట్టలను ఆశచూపించి బాబు టీడీపీ కండువా కప్పిన సంగతి తెల్సిందే .
ఎంపీల సాక్షిగా కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది అని ఢిల్లీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .అందులో బీహార్ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్, మరో రాజ్యసభ సభ్యుడు అలీ అన్వర్ అన్సారీల రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ రాజ్యసభ ఛైర్మన్ ,ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకున్నారు .దీంతో రాజ్యసభ కార్యాలయం ఒక ప్రకటనను కూడా రద్దు చేసింది .అయితే వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన ఎంపీల బృందం ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ,రాష్ట్రపతి ,ప్రధాని మోదీతో సహా అందర్నీ కల్సి వినతి పత్రం సమర్పించిన సంగతి తెల్సిందే .
తాజాగా శరద్ యాదవ్,అలీ అన్వర్ అన్సారీ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో త్వరలోనే వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీల సభ్యత్వం మీద కూడా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు అని ఢిల్లీ వర్గాలువ్యాఖ్యానిస్తున్నాయి .ఇప్పటికే పోలవరం సాక్షిగా బీజేపీ ,టీడీపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చు అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి .ఒకవేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..టీడీపీ శ్రేణులకు బ్యాడ్ న్యూస్ ..