తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించనున్నారు.ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉత్తర తెలంగాణ భవన్ కు సీ ఎం కేసీఆర్ చేరుకున్నారు .ఈ సందర్బంగా జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ , జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ , ఎమ్మెల్యే కమలాకర్ తదితరులు స్వాగతం పలికారు …
ఇవాళ తీగలగుట్టపల్లిలో సీఎం బస చేస్తారు. ఇవాళ రాత్రి అధికారులు, నాయకులతో సీఎం మాట్లాడనున్నారు. రేపు తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ ప్రాంతం, నిర్మాణంలో ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం బ్యారేజీ, సిరిపురం పంప్‌హౌస్, గోలివాడ పంప్‌హౌస్‌ను సీఎం సందర్శించనున్నారు. ఎల్లుండి మేడారం, రామడుగు దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, రాంపూర్ దగ్గర పంప్‌హౌస్ పనులు, మిడ్‌మానేరు పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.