ప్రముఖ సినీ నటుడు , జనసేన అధినేత ఇవాళ విశాఖ పట్టణంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. ఈ పర్యటన పై ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న అజ్ఞాతవాసి సినిమా ఆడియో రిలీజ్ త్వరలోనే ఉంది . అలాగే ఈ సినిమా త్వరలోనే విడుదల అవుతుంది.‘ఏక్ పంత్ దో కాజ్’ అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు. అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు. అటు రాజకీయపరంగా లాభముంటుంది, ఇటు సినిమా పరంగా ప్రమోషన్ జరిగిపోతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడమనేది తప్పు కాదు. అసలే టైమ్ తక్కువుంది. రెండింటికి పనికొచ్చే పని చేస్తుంటే అంతకన్నా ఏం కావాలి? పవన్ కల్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా, ఆయన జనాల్లోకి వెళుతున్నారు. జనాల్లోకి వెళ్లడం ఆయనకు రెండు రకాలుగానూ ఉపయోగపడుతుంది’ అని అన్నారు
