ఉండవల్లి అరుణ్ కుమార్ గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై తనదైన స్టైల్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూ ..పాలన ఎలా చేయాలో ..ప్రజలకిచ్చిన హామీలతో పాటుగా కేంద్రం విభజన చట్టంలో నెరవేర్చాల్సిన హామీలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలో కూడా సవివరంగా చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెల్సిందే .
తాజాగా పోలవరం ప్రాజెక్టు పట్ల టీడీపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నిబంధనలను తుంగలో తొక్కి దాదాపు పద్నాలుగు వందల కోట్ల పనులకు కొత్త టెండర్లను పిలవడాన్ని తప్పు బడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పిలిచిన కొత్త టెండర్లను రద్దు చేయాలని కేంద్రం లేఖ రాసింది .ఈ విషయం మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు .ఆయన మాట్లాడుతూ టీడీపీ సర్కారు చేస్తున్న అవినీతి అక్రమాల గుట్టు కేంద్రానికి తెల్సే పోలవరం ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని భావించి ఇలా లేఖ రాయడంలో తప్పు లేదు .ఇకనైనా బాబు సర్కారు తెలుసుకొని పోలవరాన్ని కేంద్రం సహకారంతో త్వరగా పూర్తిచేయాలని ఆయన సలహా ఇచ్చారు .
ఇదే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా సలహా ఇచ్చారు .జగన్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం మీద విసిగిచెందియున్న ప్రజల సమస్యలను తెల్సుకోవడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తోన్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ రావడం శుభపరిణామం అని ఆయన అన్నారు .నాడు బాబు సర్కారు నిరంకుశ పాలనపై ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేసినట్లుగా ప్రస్తుతం జగన్ కూడా పాదయాత్ర చేస్తున్నారు .అయితే జగన్ పాదయాత్ర చేయడమే కాకుండా పాదయాత్రలో భాగంగా వైఎస్ మాదిరిగా ప్రజల నుండి సూచనలను సలహాలను తీసుకొని ఎన్నికల హామీలలో చేర్చాలి .అంతే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూనే రాష్ట్రంలో మాత్రం కల్సి పోటి చేయద్దు.ఎందుకంటే రాష్ట్రంలో కల్సి పోటి చేస్తే ముస్లిం వర్గాల ఓట్లు వైసీపీకి పడవు అని ఆయన సూచించారు .ఇలా చేస్తే జగన్ ముఖ్యమంత్రి కావడం పెద్ద కష్టం ఏమి కాదు అని ఒక ప్రముఖ ఛానల్ కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు .