తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అకాలమరణంతో ఖాళీ ఏర్పడటంతో ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ ఉప ఎన్నికల్లో ఇటు అధికార పార్టీ అన్నాడీఎంకే ,అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేశారు .అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ హీరో నడిగరం మూవీ సంఘం అధ్యక్షుడు యంగ్ హీరో విశాల్ సోమవారం నామినేషన్ వేశారు .
మంగళవారం నామినేషన్ పరిశీలన రోజు కాబట్టి ఎన్నికల అధికారులు అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలించి కొన్నిటిని తిరస్కరించారు .ఇలా అధికారులు తిరస్కరించిన నామినేషన్లలలో హీరో విశాల్ నామినేషన్ కూడా ఉంది .దీంతో హీరో విశాల్ తన నామినేషన్ తిరస్కరణపై దాదాపు మూడు వందల మంది తన భారీ అనుచరవర్గంతో ధర్నాకు దిగారు .దీంతో దిగొచ్చిన ఎన్నికల సంఘం మరల పునరపరిశీలించి అన్ని మంచిగానే ఉన్నాయి అని విశాల్ నామినేషన్ ను ఆమోదిస్తున్నామని చెప్పారు .
దీంతో విశాల్ సత్యమే గెలిచింది అని తన సోషల్ మీడియా ఖాతా అయిన ట్విట్టర్ లో పోస్టు చేశారు .అయితే మరల అర్ధరాత్రి సడెన్ గా ఎన్నికల రిటర్నింగ్ అధికారి హీరో విశాల్ నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు .మంగళవారం రాత్రి సరిగ్గా 11 .10 గం.లకు హీరో విశాల్ కు మద్దతుగా సుమతి ,దీపన్ నామినేషన్ పత్రాలపై చేసిన సంతకాలు తాము కావని స్వయంగా చెప్పారు .దీంతో సుమతి తరపున ఎవరో మాట్లాడుతున్న ఆడియో టేఫులను పరిగణలోకి తీసుకోము .అందుకే విశాల్ నామినేషన్ ను తిరస్కరిస్తున్నాము చావు కబురు చల్లగా చెప్పినట్లు ఆర్ధరాత్రి ప్రకటించారు .దీంతో ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచి రాజకీయ అరంగేట్రం చేద్దామని భావించిన విశాల్ కు ఈసీ దిమ్మతిరిగే షాకిచ్చింది .