తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించనున్నారు. వచ్చే ఏడాది వానకాలం సీజన్‌లోగానే గోదావరి జలాలను ఎత్తిపోయాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నందున పనులుకూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టుకు కావాల్సిన పలురకాల అనుమతులు కూడా కొన్నిరోజులుగా వరుసగా వస్తున్నాయి. ప్రాజెక్టు పనులను మొదటినుంచి సీసీ కెమెరాల ద్వారా ప్రగతిభవన్‌నుంచి పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి.. తాజాగా రెండ్రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళుతున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
సీఎం పర్యటన షెడ్యూల్
బుధవారం
-మధ్యాహ్నం 3.50గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు 3.55 గంటలకు చేరుకుంటారు.
-4.35 గంటలకు హెలికాప్టర్ ద్వారా కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లికి చేరుకుంటారు.
-4.40కి తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుని, రాత్రి బస చేస్తారు.
గురువారం ఉదయం
-9 గంటలకు తీగలగుట్టపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరుతారు.
-9.50 గంటలకు తుపాకులపల్లి బరాజ్ వద్దకు చేరుకుంటారు.
-10.20 వరకు బరాజ్ పనులను పరిశీలిస్తారు.
-10.40కి మేడిగడ్డ బరాజ్ వద్దకు చేరుకుంటారు.
-11.00 గం. వరకు మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలిస్తారు.
-11.15 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకుంటారు.
-11.45 వరకు పంపుహౌస్‌ను పరిశీలిస్తారు.
మధ్యాహ్నం
-12.00 గంటలకు అన్నారం బరాజ్ వద్దకు చేరుకుంటారు.
-12.20 వరకు బరాజ్‌ను పరిశీలిస్తారు.
-12.40కి శ్రీపురం పంపుహౌస్ వద్దకు చేరుకుంటారు. అనంతరం భోజనం చేస్తారు.
-1.30 వరకు పంపుహౌస్‌ను పరిశీలిస్తారు.
-2.00కు సుందిళ్ల బరాజ్ వద్దకు చేరుకుంటారు.
-2.20 వరకు సుందిళ్ల బరాజ్‌ను పరిశీలిస్తారు.
-2.45కి గోలివాడ పంపుహౌస్ వద్దకు చేరుకుంటారు.
-3.30 వరకు పంపుహౌస్ వద్ద పరిశీలిస్తారు.
-సాయంత్రం 4.15 గంటలకు రామగుండంలోని ఎన్టీపీసీకి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస.
శుక్రవారం ఉదయం
-9.00 గంటలకు రామగుండం నుంచి బయలుదేరుతారు.
-9.20 గంటలకు మేడారం పంపుహౌస్ వద్దకు చేరుకుంటారు.
-మధ్యాహ్నం 12.00 గంటల వరకు పంపు హౌస్‌ను పరిశీలిస్తారు.
-12.20గంటలకు రామడుగు మండలంలోని పంపుహౌస్ పనులను పరిశీలిస్తారు. అనంతరం అక్కడే భోజనం చేసి, అధికారులతో సమీక్షిస్తారు.
-2.45 గంటలకు మల్యాల మండలం రాంపూర్‌లోని పంపుహౌస్ పనుల వద్దకు వెళ్తారు.
-3.15వరకు పంపుహౌస్ పనులను పరిశీలిస్తారు.
-3.40 కు మధ్య మానేరుకు చేరుకుంటారు.
-3.45 వరకు మధ్యమానేరును పరిశీలిస్తారు.
-సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.