తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ ఆహ్వానం పలుకుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనకు ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాష, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, పండుగల, సామెతల ఆధారంగా అనుకూలంగా ఉండే కార్టూన్లను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్టూన్లను A3 సైజులో మాత్రమే వేయాలని సూచించారు. కార్టూన్లను డిసెంబర్ 10వ తేదీ లోపు wtmscartoon@gmail.comకు ఈమెయిల చేయాలని సూచించారు. ఈ ప్రదర్శన నిర్వాహకులుగా కార్టూనిస్టులు మృత్యుంజయ్, శంకర్, నర్సిం వ్యవహరించనున్నట్లు హరికృష్ణ చెప్పారు.
