డిజిటల్ లావాదేవీల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు . మీ సేవ 10 కోట్ల లావాదేవీలు పూర్తిచేసుకున్న సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ మీ సేవ ఆపరేటర్ల అసోసియేషన్ నిర్వహించిన వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Minister @KTRTRS addressed the Mee Seva Operators at 10 Crore Transactions Celebrations program at Ravindra Bharathi, Hyderabad, today. pic.twitter.com/sxKHPCR5SP
— Min IT, Telangana (@MinIT_Telangana) December 5, 2017
ఈ సందర్భగా కేటీఆర్ మాట్లాడుతూ… మీ సేవ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు . 86 ఏండ్ల తర్వాత భూరికార్డుల ప్రక్షాళన జరుగుతున్నదని వెల్లడించారు. వంద శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసిన జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలిచిందన్నారు. ఇంటింటికీ మంచినీళ్లతోపాటు ఫైబర్‌గ్రిడ్ కనెక్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఫోన్లు కలిగిన రెండో దేశంగా భారత్ నిలిచింది. టీ-వాలెట్‌ను ఇప్పటికే 3 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నరు. మీ సేవకు బ్యాడ్‌బ్యాండ్ ఉచితంగా ఇస్తమని కేటీఆర్ అన్నారు. గ్రామాల్లో పని చేయడానికి వైద్యులు, ఉపాధ్యాయులు ఇష్టపడటం లేదని..అందుకే, టీ ఫైబర్ ద్వారా రానున్న రోజుల్లో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలంటే మనకు తెలియాలని, అందుకే డిజిటల్ లిటరసీ అందిపుచ్చుకోవాలని కేటీఆర్ సూచించారు. మీ-సేవ ఆపరేటర్లు అందరూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో భాగస్వాములైతే కోటి మందిని డిజిటల్ అక్షరాస్యుల్ని చేసే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు.డిజిటల్ లావాదేవీలు నిర్వహించడానికి టి-వ్యాలెట్ రూపొందించామని కేటీఆర్ తెలిపారు.
Minister for IT @KTRTRS participated in the 10 Crore Transactions Celebrations program organised by Telangana Mee Seva Operators Association in Hyderabad. pic.twitter.com/saIk732N82
— Min IT, Telangana (@MinIT_Telangana) December 5, 2017