ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ,ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్ శివప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో చేరబోతున్నారు అని వార్తలు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే .అయితే ,భారతరాజ్యాంగ నిర్మాత ,భారతరత్న డా.బి.ఆర్ .అంబేద్కర్ జయంతి సందర్భంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీలకిచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు .
ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కూడా దళితులకు బాబు అన్యాయం చేశారు అని బహిరంగగానే విమర్శల వర్షం కురిపించిన సంగతి తెల్సిందే .అప్పటి నుండి నేటి వరకు ఆయన ఇటు పార్టీ ,అటు అధికారక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు .కానీ ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ ఎమ్మెల్యే ,గతంలో తను గెలవడానికి కారణమైన ఆర్కే రోజాతో సమావేశం అయ్యారు .ఈ సమావేశం సందర్భంగా తను వైసీపీ పార్టీలోకి వస్తున్నట్లు .అందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వేచిచూస్తున్నాను అని అన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి .
ఈ వార్తలపై ఆయన స్పందిస్తూ తనకు ,దళితులకు గత మూడున్నర ఏండ్లుగా అన్యాయం జరిగిన మాట నిజమే .కానీ తను ఇప్పుడు పార్టీ మారడంలేదు .చంద్రబాబుకు తనకు ఎటువంటి గ్యాప్ లేదు .కావాలనే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు .వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తారా లేదన్నది బాబు గారికి మాత్రమే తెలుస్తుంది .నాకు ఎలా తెలుస్తుంది అని సమాధానమిచ్చారు .అయితే ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యల బట్టి ఆయన పార్టీ మారడానికి సిద్ధమయ్యారు .కానీ సీటు ఇస్తారా లేదన్నది దానిపైనే ఆధారపడి ఉంటుంది అని ఇటు టీడీపీ శ్రేణులకు ,అటు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పరోక్షంగా సంకేతాలు పంపారు అని రాజకీయ వర్గాలు గుస గుసలాడుకుంటున్నారు.