ధనవంతులతో సమానంగా పేదవారు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు . కామారెడ్డి జిల్లా లోని బాన్సువాడలోని వారాంతపు సంత, బోర్ల క్యాంపు, కృష్ణనగర్ తండాలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను మంత్రి పోచారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.గత ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణం కోసం డ్బ్బై వేలో, లక్ష రూపాయాలో ఇచ్చి చేతులు దులుపుకొన్నారని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తుందని ఉద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 70 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు.
