కోదండరాం నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయడం లేదు… కేవలం ఆయన కొలువు కోసం తండ్లాడుతున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు.టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు..టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసి కొంతమంది నాయకులు, ఆయా సంఘాలు తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా కొందరు కొట్లాట చేయడం సమంజసం కాదన్నారు. ఉద్యోగాల కల్పనకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.మొన్నటి దాకా ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసులు వేశారు. ఇప్పుడేమో ఉద్యోగాల భర్తీని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉద్యోగాల భర్తీ అనేది సున్నితమైన అంశం.. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రిని ఎవరూ నామినేట్ చేయలేదన్నారు. ప్రజాతీర్పుతో సీఎం అయ్యారని తెలిపారు. కోదండరాంను టీ జేఏసీ చైర్మన్‌గా కేసీఆర్ నామినేట్ చేశారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు.
