రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లా లో పర్యటిస్తున్నారు . ఈ క్రమంలో మండల కేంద్రంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసారు.ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ…పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిరంతర పక్రియ .. ఇండ్లు లేని పేదలందరికీ లబ్ది చేకూరే వరకు కొనసాగుతుందని అన్నారు . త్వోరలోనే నల్లగొండ , మిర్యాలగూడ లో ఇండ్ల నిర్మాణం చేపడుతామని అన్నారు . ఈ ఏడాది రెండు లక్షల యాబై వేల ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తున్నారు .డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నాణ్యత , నిబంధన అంశాల్లో ఎక్కడ రాజిపడేది లేదని అన్నారు