తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ పట్టణంలో నాయీ బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన కేసీఆర్ కు “అభినందన సభ” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. ఆయన మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం 250 కోట్ల రూపాయలను కేటాయించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారికి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత గత 70 సం౹౹ పాలన లో ఎన్నడూ లేని విధంగా పరిపాలన సాగుతున్నది అని అన్నారు, ఎం.బి.సి. లను గుర్తించిన తొలి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారు అని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ద్యేయంగా ఎం.బి.సి. కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అని అన్నారు.పేద విద్యార్థుల కోసం 119 బి.సి గురుకుల పాఠశాలలను ఒకే రోజు ఏర్పాటు చేసిన ఘనత తెరసా ప్రభుత్వానిది అని వారు కొనియాడారు.
నాయీ బ్రాహ్మణుల సేవ చాలా ఆమోఘమైనదని అనాగరికులుగా ఉన్న వారిని నాగరికులుగా మార్చే గొప్ప వ్యక్తులు అని, పూర్వం ఎంతో వైభవంగా ఉన్న వీరి చరిత్ర గత 70౹౹ ల పాలనలో ఎన్నో చీదరింపులకు గురైందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వీరి అభివృద్ధికి 250 కోట్ల రూపాయలని కేటాయించడం ఎంతో గొప్ప విషయం అని తెలిపారు. ఎం.బి.సి.ల అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మునికపల్ చైర్మన్ శ్రీమతి రాధ అమర్ గారు, నాయీ రాష్ట్ర అధ్యక్షులు రసమల్ల బాలకృష్ణ, పెంబర్తి శ్రీనివాస్, గడల రాజు, తిరుపతయ్య, నర్సింలు, కొత్తపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.