దేశంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. మరి కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తెలిసి కూడ తప్పు చేస్తున్నారు. ఇదే తరహలో తాజాగా 30 సంవత్సరాల మహిళ కట్టుకున్న భర్తపై మర్మాంగాలపై బాగా వేడి వేడి నునే పోసిన ఘటన జరిగింది. వేడి వేడి నూనె పోయడంతో భర్త ప్రైవేట్ పార్ట్స్‌పై కాలిన గాయాలు అయ్యాయి. అతను ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గాయాలతో బాధపడుతున్న అతను రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. నిందితురాలిని మధురైలోి నెహ్రూ నగర్‌కు చెందిన పి. శశికళగా గుర్తించారు.
అయితే భర్త విరాట్‌పత్తులోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఆ విషయం తెలిసిన శశికళ భర్తతో గొడవ పడుతూ వస్తోంది. దాంతో అతను ఇంటికి రావడమే మానేశాడు. వివాదం ఎస్ఎస్ కాలనీ పోలీసు స్టేషన్లో నలుగుతోంది. గతవారం శశికళ భర్తను ముద్దుగా పలకరించి, అతన్ని ఇంటికి ఆహ్వానించింది. శనివారం రాత్రి అతను ఇంటికి వచ్చాడు. అతను పడకపై పడుకుని నిద్ర పోతూ ఉండగా వేడి చేసిన నూనెను తెచ్చి అతని ప్రైవేట్ పార్ట్స్‌పై పోసింది.
