సినీ జనాలకు అతిలోక సుందరిని పరిచయం చేసిన నటి శ్రీదేవి. ఇప్పటి యువ హీరోయిన్లకు తాను ఏ మాత్రం తక్కువ కాదంటున్న శ్రీదేవి ఒకానొక సమయంలో ఇండియాలోని అన్ని సినీ ఇండస్ర్టీల్లోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభవించింది. తన కూతుళ్లు సినీ ఇండస్ర్టీలోకి ఆరంగ్రేటం చేస్తున్న సమయంలో కూడా శ్రీదేవి తన సొగసులకు పదును తగ్గలేదని నిరూపించే పనిలో ఉంది. సినీ నటుల కార్యక్రమాలు జరిగినప్పుడల్లా తనదైన శైలితో మోడ్రన్ డ్రస్‌లలో మెరుస్గూ తన హాట్ హాట్ అందాలను ఒలకబోస్తోంది.
అయితే, తాజాగా ముంబయిలో జరిగిన ఫిల్మ్ ఫేర్ గ్లామర్ అవార్డు ఫంక్షన్ జరుగగా.. ఆ కార్యక్రమం కాస్తా శ్రీదేవి అందాల ఆరబోతకు వేదికగా మారింది. అక్కడికి చాలా మంది యువ నటీనటులు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వచ్చారు. వారందరిలో కల్లా అందరికళ్లను తనవైపుకు తిప్పుకుంది 54 ఏళ్ల శ్రీదేవి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌన్‌ను ధరించిన శ్రీదేవిపి చూసిన బాలీవుడ్ జనాలు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఓ వైపు తన కూతుర్ని కథానాయికగా పరిచయం చేస్తూనే.. మరో పక్క శ్రీదేవి తన హాట్ హాట్ అందాలతో ఫోటోలకు ఫోజులిస్తూ యువత మదిని దోచుకుంటోంది. శ్రీదేవి మరీ అంత గ్లామర్‌గా తయారై రావంతో బాలీవుడ్ జనాలు ఆశ్యర్యకితులయ్యారనడంలో ఎలాంటి సందేహంం లేదు. అయితే, శ్రీదేవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ – వింగ్లీష్, మామ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.