పవర్ స్టార్ పవన్ కల్యాన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. ఇటీవల ఈ చిత్ర బృందం అజ్ఞాతవాసి టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు కూడా. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నా కూడా.. సినీ జనాలు ఈ చిత్రంపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబోనే. భారీ అంచానాలు ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం రికార్డులను సొంతం చేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే బాహుబటి – 2, దంగల్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది.
అయితే, తాజా సమాచారం మేరకు అమెరికాలో జనవరి 9న రికార్డు సృష్టించబోతున్నాడు అజ్ఞాతవాసి. ఇప్పటి వరకు అమెరికా సనీ చరిత్రలో ఏ మూవీ విడుదలకానన్ని లొకేషన్స్‌లో పవన్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఆ చిత్రం డిస్ర్టిబ్యూటర్సే వెల్లడించారు. ఇప్పటి వరకు బాహుబలి -2 చిత్రం 126 లొకేషన్స్‌లో, ఖైదీ నెం.150 – 74, కబాలి – 73, అమీర్‌ఖాన్ నటించిన దంగల్ ఇత్రం – 69 లొకేషన్స్‌లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే, వీటన్నింటిని దాటుకుంటూ పవన్ అజ్ఞాతవాసి ఏకంగా 209 లొకేషన్స్‌లో రీలీజ్ అవడం పవన్ ఫ్యాన్స్‌ను ఉర్రూతగూలించే న్యూసే మరీ.