ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుమ్మక్కై వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్యాలను ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాథాకృష్ణకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, చంద్రబాబు సర్కార్ హయాంలో ఆంధ్రప్రదేశ్ కరువు కోరల్లో చిక్కుకుందని, అంతేకాక, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాంటూ వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ఆంధ్రజ్యోతి పత్రిక చంద్రబాబు సర్కార్‌తో కుమ్మక్కై తప్పుడు కథనాలును ప్రచురించింది. జగన్ పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా ఆ ప్రచురణలు ఉండటంతో ఆంధ్రజ్యోతి ఎండీ రాథాకృష్ణతో సహా మరో ఆరుగురిని బాధ్యులు చేస్తూ.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాథాకృష్ణ హైకోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉన్నా.. హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ తన అనూకుల మీడియా ద్వారా.. తనకు అనుకూలంగా వార్తలను ప్రచురించచుకున్నారు రాథాకృష్ణ. అదే క్రమంలో మంగళవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కానీ, ఆయన హాజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు సీరియస్‌గా స్పందించింది. అంతేగాక వేమూరి రాధాకృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఇవాళ జరగనున్న విచారణకు వ్యక్తిగతంగా హాజరై తీరాల్సిందేనని ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ కె.శ్రీనివాస్, పబ్లిషర్ శేషగిరిరావు, మరో నలుగురు ఉద్యోగులను ఆదేశించింది. వేమూరి రాధాకృష్ణ మంగళవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కానీ, ఆయన హాజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు సీరియస్‌గా స్పందించింది. ఇప్పటికే వేమూరి రాధాకృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు నాంపల్లి కోర్టు మంగళవారం హాజరు కాకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశించింది.